Tuesday, May 6, 2025
- Advertisement -

ప్రత్యక్ష పోరుకు రెడీ.. ఆ నియోజకవర్గాన్ని ఎంచుకొన్న పవన్!

- Advertisement -

జనసేన అధ్యక్షుడు మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఎన్నికల ముందు తెలుగుదేశం , భారతీయ జనతా పార్టీలకు మద్దతు ప్రకటించిన ఆయన ఇప్పుడు మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? ప్రశ్నిస్తానన్న పవన్ ఎక్కడా? అనే విమర్శలు వస్తున్న తరుణంలో పవన్ ట్విటర్ ద్వారా  కాకుండా మీడియా ముందుకు వచ్చి..

వివిధ అంశాల గురించి మాట్లాడి వెళ్లాడు. ఈ మాట్లాడటంలో ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు దారుగానే కనిపించాడు!

మరి ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం ఏమిటంటే.. పవన్ ప్రత్యక్ష ఎన్నికల పోరుకు రెడీ అయ్యాడనేది! జనసేన అధ్యక్షుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి నియోజకవర్గాన్ని కూడా ఎంచుకొన్నాడనే ప్రచారం ఆసక్తిని రేపుతోంది. అన్నీ కుదిరితే పవన్ సనత్ నగర్ నియోజకవర్గ  ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్ తెరాసలో చేరిన సంగతి తెలిసిందే.

ఆయన రాజీనామా ఆమోదం పొంది.. ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలొస్తే పవన్ ఇక్కడ నుంచి పోటీ చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయడమే మంచిదనే భావనలో ఉన్నాడట. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఏపీలో అయితే పవన్ అసెంబ్లీలోకి ఎంటరయినా అంత బావుండదు. ఎందుకంటే.. పవన్ , తెలుగుదేశం పార్టీలు మిత్రపక్షాలు. మరి సనత్ నగర్ లో అనుకూలంశాలెన్నో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ బలం, సెటిలర్ల ఓట్లు పవన్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆయన ఈ నియోజకవర్గాన్ని ఎంచుకొన్నట్టు భోగట్టా. మరి సనత్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలొస్తే పవన్ పోటీ చాలా ఆసక్తికరమైన అంశం అవుతుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -