పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే ఈ 2019 ఎన్నికల నాటికి గెలుపుకోసం ఎవరి వ్యూహాలు వారికున్నాయ్. ఇక పవన్ 2019 ఎన్నికల నాటికి ఈ మీడియా ఊండాలని ఇదివరకే గుర్తించాడు. ముందుగా యూట్యూబ్ చానెల్ ఒకటి ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు. అలాగే సమాజిక మధ్యమాల్ని విరివిగా ఉపయోగించుకుని తన పార్టీ జనసేనను కాపాడుకోవాలని కొత్త ప్రయత్నాలు ప్రారంభించాడు.
ఇక నేరుగా తేదేపా, వైసీపీ సహా ఇంతర పార్టీలతో యుద్ధానికి దిగుతున్నాడు కాబట్టి తనని ప్రమోట్ చేసి ఓ న్యూస్ చానెల్ సొంతంగా కావాలి. తనని రాంగ్‍సైడ్ పోకస్ చేసే ఇతరత్రా మీడియా నుంచి తనని తాను కాపాడుకోవాలంటే తనకంటూ ఓ టీవీ చానెల్ తప్పనిసరి అని పవన్ భావిస్తున్నారుట.
ఈ విషయంలోనే పవన్ మైండ్ లో పూర్తి క్లారిటీ లేదని సన్నీహితులు చెబుతున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి సొంతంగా మీడియా పెట్టాలని ప్రయత్నించి విఫలమయ్యారని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ జనసేన గెలిపించుకోవాలంటే అలా వైఫల్యం చెందకకూడదు. అనుకున్నదే తడవుగా బలాల్ని సమీకరించుకున మీడియాని తేవాలి. తనకంటూ ఓ సొంత మీడియా తప్పనిసరి. కాబట్టి అన్నయ్య చేసిన తప్పును రిపీట్ చేయకుడా అనుకున్నది సాధించుకుంటాడేమో చూడాలి.