Saturday, May 3, 2025
- Advertisement -

సూపర్ సిక్స్‌ అంటూ చేతులెత్తేశాడు!

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సూపర్ సిక్స్ అని చెప్పి‌‌…ఇప్పుడు చేయాలేను అని చంద్రబాబు చేతులెత్తాడు అని మండిపడ్డారు. ఎంతమంది పోయినా ఎంత మంది వచ్చిన వైసీపీ పార్టీకి ఏం కాదని.. మళ్ళీ వైసీపీ గతం కంటే ఎక్కవ సీట్లలో విజయం సాధించడం ఖాయం‌ అన్నారు. ఇక విజయసాయిరెడ్డి రాజీనామా ఆయన వ్యక్తిగతం అని తేల్చేశారు పెద్దిరెడ్డి.

పుంగనూరు లో ఎస్టేట్ అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. గతంలో ఇలాంటి తప్పుడు వార్తలపై యాభై కోట్లు పరువు నష్టం దావా వేశాను అన్నారు. 2001లో దాదాపు 75 ఎకరాలను స్దానికుల నుండి కోనుగొలు చేశాం‌నన్నారు. సొంత డబ్బులతో కొన్న దానిపై కూడా అసత్య ప్రచారం చేశారన్నారు.

చంద్రబాబు కుట్రలు చేయడంలో దిట్టా , వ్యక్తిత్వహననం చేయాలని రకరకాల కుట్రలు చేస్తున్నారు అన్నారు. 2001లోనే అక్కడ ఇల్లు కట్టాము….అప్పుడే మామిడి చెట్లు పెట్టాము…ఇరవై ఏళ్ల తరువాత ఇప్పుడు అటవీ భూములు ఆక్రమించారంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే విచారణ జరిగింది ప్రైవేట్ భూమి నివేదిక ఇచ్చారు అని గుర్తు చేశారు.

ఒక అబద్దం పదిసార్లు చెబితే నిజం అయిపోదని… తప్పుడు ప్రచారంపై మళ్లీ పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు పెద్దిరెడ్డి.ఎన్నికల ముందు నలబై వేల కోట్లు ఇసుక లో దోచుకున్నాడని నాపై పవన్ ప్రచారం చేశారు‌…. ఇప్పుడు ఎందుకు నా మీద చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -