Sunday, May 4, 2025
- Advertisement -

ప్ర‌పంచంలో మోదీ నెంబ‌ర్ 3…. ప్ర‌పంచ నేత‌ల‌పై ‘గాలప్’ సర్వే….

- Advertisement -

ప్రపంచంలోని ప్రజాదరణ పొందిన నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడోస్థానంలో ఉన్నారని గాల్లప్ ఇంటర్నేషనల్ వార్షిక సర్వేలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో నిర్వహించిన సర్వేలో మోదీ చైనా అధినేత జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే ముందుండటం గమనార్హం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ తొలిస్థానంలో ఉండగా.. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ రెండో స్థానంలో ఉన్నారు.

జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ మొదటి స్థానంలో నిలిచారు. ఆమె పట్ల 49 శాతం మంది సానుకూల అభిప్రాయాలను వ్యక్తీకరించారు. వ్యతిరేకంగా స్పందించింది కేవలం 29 శాతమే. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మెక్రాన్ ద్వితీయ స్థానంలో ఉన్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. మన ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా 30 శాతం మంది స్పందించగా, వ్యతిరేకంగా అభిప్రాయం తెలిపిన వారు 22 శాతం. నాలుగో స్థానంలో బ్రిటన్ ప్రధాని థెరీసామే, ఐదో స్థానంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారు.

భారత ఉపఖండంలో మోదీ పాపులర్ లీడర్ అని సర్వే తెలిపింది. అప్ఘాన్‌లో 69 శాతం మంది, బంగ్లాదేశ్‌లో 51 శాతం మంది మోదీ పట్ల సానుకూలంగా ఉన్నారని ఈ సర్వేలో తేలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్ల 53 శాతం మంది భారతీయులు సానుకూలంగా ఉన్నారని ఈ సర్వే తెలిపింది. ఆసియాలో మరే దేశంలో ట్రంప్‌కి ఈ రేంజ్‌లో ఆదరణ దక్కలేదు. అమెరికాలో 34 శాతం మంది మోదీ పట్ల సానుకూలంగా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -