Monday, May 5, 2025
- Advertisement -

ఓటుకు నోటు లో కీలక వ్యక్తికి టీడీపీ టికెట్

- Advertisement -

ఇప్పుడంటే అందరూ మరచిపోయారు కానీ మొన్నటికి మొన్న ఓటుకు నోటు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలనీ ఇరుకున పెట్టేశాయి. నారా లోకేష్ కి అనుచరుడూ , ఓటుకు నోటు కేసులో ఏసీబీ ముందర హాజరు అయిన తెలుగు యువత నేత ప్రదీప్ చౌదరి కి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరిలో టికెట్టు ఇవ్వడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

లోకేష్ స్వయంగా అతనికి వెంగళరావు నగర్ డివిజన్ లో టీడీపీ తరఫున టికెట్ ఇచ్చారు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కి కూడా ఇతను ప్రధాన అనుచరుడు. గ్రేటర్ హైదరాబాద్ తెలుగు యువత కి ఆయన ఉపాధ్యక్షుడు. వెంగళరావు నగర్  స్థానానికి తీవ్రమైన పోటీ ఏర్పడింది, బీజేపీ కూడా తమకి అక్కడ డివిజన్ కేటాయించాలి అని కోరినా లోకేష్ పట్టి మరీ ఆ స్థానం ఇతనికి ఇప్పించినట్టు తెలిస్తోంది.

ఓటుకు నోటు కేసు విచారణ సమయంలో కాల్ లిస్ట్‌లలో ప్రదీప్ చౌదరి నంబర్ పలుసార్లు కనబడటంతో తెలంగాణ ఏసీబీ పోలీసులు అతనికి నోటీసులు పంపి పిలిపించుకుని అనేకసార్లు విచారణ చేశారు. అయితే అరెస్ట్ చేయలేదు. తరవాత కేసు ముందుకు సాగలేదు, అంతా సైలెంట్ అయిపోయారు కూడా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -