వైసీపీ లో భారీ మార్పులు చోటు చేసుకోబుతున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిషోర్ నిర్వహించిన సర్వే, ఇచ్చిన సూచనలు టికెట్ల కేటాయింపు తదితర అంశాలపైనే వైసీపీ నేతల్లో చర్చ సాగుతోంది. అయితే ఈమార్పులు,చర్చలు పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలగుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి.
2019లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తనవంతు సహకారాన్ని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో పలువురికి ప్రజాదరణ లేదని, వారికి సీట్లు కేటాయిస్తే, గెలిచే అవకాశాలు ఉండవని, మరో మంచి అభ్యర్థిని చూసుకోవాలని ఆయన చెప్పడంతో, ఆ 25 మంది ఎవరా అన్న కొత్త చర్చ మొదలైంది.
గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను ఇవ్వడం వల్ల వైకాపా నష్టపోయిందని, ఈ దఫా అలా జరుగకుండా చూసుకోవాలని ప్రశాంత్ కిశోర్ సూచించినట్టు తెలుస్తోంది. మొత్తం 46 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైకాపాలో ఉండగా, వారిలో దాదాపు 25 మంది పేర్లను వెల్లడించిన ఆయన, వారిని దూరం పెట్టాలని పేర్కొన్నారని సమాచారం.కాగా రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే ప్లీనరీ తరువాత పార్టీలో మార్పులు జరుగుతాయని తెలుస్తోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఔట్….
- ప్రశాంత్ కిషోర్‌తో డీల్… 2019 ఎన్నికలకు జగన్ పక్కావ్యూహం..
- ప్రతిపక్ష పార్టీ పై బురదజల్లే కార్యక్రమాన్ని ప్రారంభించిందా పచ్చపార్టీ అనుకూల మీడియా….?
- వైసీపీకి మరింత పెరగనున్న సినీ గ్లామర్…..?
{youtube}8xgiuw7xDNs{/youtube}