Tuesday, May 6, 2025
- Advertisement -

” వరంగల్ మనకి వద్దు ” ముఖ్యమంత్రి మీద తమ్ముళ్ళ ఒత్తిడి ?

- Advertisement -

వరంగల్ లో బై ఎలెక్షన్ కి ఎన్నికల నగారా మొగేయడంతో ఆ బరిలో ఏపీ అభ్యర్ధికి కేవలం ఎన్డీయే కి మాత్రమే ఉంటాడు అని అధికారికంగా తెలుస్తోంది. తెలుగుదేశం – బీజేపీ ఏ పార్టీ వారు అయినా సరే అందరం కలిసి విజయంకోసం పనిచేస్తాం అని జనాంతికంగా తెలుగుదేశం వారు తెలిపిన విషయం. అమిత్ షా దగ్గరకి వెళ్లి తెలుగు దేశం కి సీటు దక్కే విధంగా మంత్రాంగం నడపాలి అనేది టీటీడీపీ ఆలోచన.

 చంద్రబాబు ప్రోత్సాహంతో జరుగుతున్న ప్రయత్నంలాగా ఇది కనపడ్డం లేదు. నిజానికి బాబు గారికి ఈ సీటు బీజేపీ కి వదిలేయడమే ఇష్టం కానీ తెలుగుదేశం నేతలు ఆయనకి నచ్చజెప్పి మరీ ఈ బాధ్యత తమ నెత్తిన పెట్టుకున్నారు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక కొత్త ట్విస్ట్ వస్తోంది. ఒకవేళ అమీత్ షా వీరి మాటలు విని టీడీపీ కే సీటు ఇవ్వడం కోసం ఒప్పుకున్నా ఆ సీటు తమకి వద్దు అని బీజేపీ కి దాన్ని అప్పజెప్పాలి అని చంద్రబాబు కి కాస్త ప్రీతిపాత్రులు అయిన ఆంతరంగిక నాయకులు పార్టీ కోటరీ నుంచి ఆయనమీద ఒత్తిడి తెస్తున్నారు అని సమాచారం. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా ఈ విషయం మనకి విశ్వసనీయంగా తెలుస్తోంది. 

బీజేపీ ఒప్పుకున్నా కూడా వరంగల్ లో పోటీ ఒద్దంటే ఒద్దు అంటున్నారు కొందరు బడా నాయకులు. ప్రస్తుత పరిస్థితిలో తెలుగుదేశం వరంగల్ సీట్ గెలవడం అనేది అసలు జరిగే పని కాదు అని వారి లాజిక్ గా చెబుతున్నారు.ఒక వేళ గెలిచినా కూడా ఎదో పార్టీ గెలిచింది అని సంతృప్తి పడాలి కానీ పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. పార్టీ తరఫున అభ్యర్ధిని పెడితే ఎంపీ స్థానానికి ఆర్ధికంగా ఖర్చులు ఆ వ్యక్తే పెట్టుకోగల దళిత నేత ఎవరూ టీడీపీలో లేనే లేరు కాబట్టి ఒకసారి బరిలో దిగిన తరవాత ఆర్ధిక వనరులు ఏర్పరచడం తమమీద పడే భారీ భారం అనేది వారి లాజిక్. ఒకటా రెండా కొన్ని కోట్ల రూపాయలు సర్దాల్సి వస్తుంది. 

వరంగల్ లాంటి చోట తీరా రంగంలోకి దిగి ఖర్చుకి వెనకాడే నియోజికవర్గం అయితే కాదు మరి. ఎన్నికోట్లు సర్దుబాటు చేసినా.. పార్టీ గెలిచినా, ఓడినా తమకు దక్కేది మాత్రం ఏమీ ఉండదని.. ఆ భాగ్యానికి భారం ఎందుకనే ఉద్దేశంతో అసలు సీటు వదిలేసుకుందాం అని చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారట. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -