ఎన్నికల ఫలితాలు రాకముందె అన్ని పార్టీ విజయం తమదేనని ధీమాతో ఉన్నాయి. ఏకంగా టీడీపీ, వైసీపీ లు సీఎంగా ప్రమాణస్వీకారాణికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. టీడీపీ పోటీ చేసిన అభ్యర్థుల గెలుపోటములపై వరుస సమీక్షలు నిర్వహిస్తుంటే వైసీపీ నేతలు మాత్రం అప్పుడే కొత్త ప్రభుత్వానికి ఏర్పాట్లు చేసుకోవడంలో నిమగ్నమైపోయారు.
ఇదలా ఉంటె..పోలింగ్ ముగిసిన రెండు మూడు రోజులకే సోషల్ మీడియాలో ఓ నేమ్ ప్లేట్ తీవ్ర కలకలం రేపింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని ఇంగ్లీష్‌లో ఉన్న ఆ నేమ్ ప్లేట్ బాగా వైరల్ అయ్యింది. దీనిపై టీడీపీ వర్గాలు వైసీపీకీ గట్టిగానె కౌంటర్ ఇచ్చారు. జగన్ ఎంత పదవీదాహంతో ఉన్నాడో.. సీఎం కాకముందే నేమ్ ప్లేట్ రెడీ చేయించుకున్నాడని టీడీపీ వర్గాలు విమర్శలు చేశారు.
టీడీపీ చేసిన విమర్శలపై తాజాగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చేసిన ప్రకటన టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది.”ఎవడో వెధవ ఆ నేమ్ ప్లేట్ తయారుచేయించి ఉంటాడు.. దాన్ని వైసీపీ నేతలకు అంటగట్టడమేంటి..? వీళ్లు ఛాన్స్ ఇస్తే జగన్మోహన్ రెడ్డికి బదులు డూప్‌ని తయారుచేస్తారేమో.. అంటూ ఎద్దేవ చేశారు.

ఏపీ ఎన్నికల ఫలితాలు మరో 18 రోజుల్లో వెల్లడి కానున్న నేపథ్యంలో మళ్లీ నేమ్ ప్లేట్ వార్తల్లో నిలుస్తోంది. వైసీపీ నేత 30 ఇయర్ప్ ఇండస్ట్రీ పృథ్వీ తాజాగా జగన్ నేమ్ ప్లేట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నేమ్ ప్లేట్ తయారుచేయించుకోవాల్సిన అవసరం జగన్‌కి లేదు. జగన్ సీఎం పీఠం ఎక్కిన తర్వాత, నేమ్ ప్లేట్ ఆటోమేటిక్‌గా అధికారులే గౌరవంగా జగన్‌కు తెచ్చి ఇస్తారంటు పృధ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతటితో ఆగకుండా.. ఆల్రెడీ జగన్ నేమ్ ప్లేట్ కు సంబంధించి ఏర్పాట్లు ముందుగానే జరుగుతూ ఉండొచ్చు.. అని కామెంట్ చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.