Sunday, May 4, 2025
- Advertisement -

ముఖ్యమంత్రి .. పవన్ కళ్యాణ్ .. సీఎం పవర్ స్టార్

- Advertisement -

తమ అభిమాన హీరోలు రాజకీయ నాయకులు అవ్వగానే ముఖ్యమంత్రులు అయిపోవాలి అని కోరుకుంటారు ఫ్యాన్స్. ఆ మధ్య బాలకృష్ణ ఫ్యాన్స్ బాలయ్య కనపడ్డం ఆలస్యం సీఎం బాలయి , ముఖ్యమంత్రి బాలయ్య అంటూ గొడవ గొడవ చేసేవారు.

బాలయ్య కి సరిగ్గా ఎన్నికల ముందర ఈ వేడి బాగా తగిలింది . చంద్రబాబు ఉండగా తెలుగుదేశం అధికారంలోకి ఒస్తే బాలయ్య ఎలా ముఖ్యమంత్రి అవుతాడు అనే ఆలోచన కూడా లేకుండా వారి అభిమానం చూపించారు వాళ్ళు .. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కి లానే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ సీఎం అంటున్నారు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ సభ సందర్భంగా ‘సీఎం’ నినాదాలు గట్టిగానే వినిపించాయి. సీఎం పవర్ స్టార్.. సీఎం పవర్ స్టార్ అంటూ వాళ్లు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం విశేషం.

ఐతే ఈ నినాదాల్ని పవన్ పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. అలాగే ‘జై పవనిజం’ అనే నినాదాలు కూడా జోరుగానే వినిపించాయి ఈ సభలో. తనకు పదవుల మీద ఎలాంటి ఆశ లేదని.. అందుకోసం రాజకీయాలు చేయట్లేదని పవన్ ఓవైపు స్టేజ్ మీద నొక్కి వక్కాణిస్తుంటే అభిమానులేమో తమ హీరోను ఏకంగా ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడుతున్నారు. 

Related 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -