వంద రూపాయల కి అర్ధ రూపాయి అంటే ఇది లెక్కల్లో పెద్దగా కనపడని అమౌంట్ కావచ్చు గానీ ఈ వ్యవహారం ఎన్నో అర్ధ రూపాయలు కలిపి చూస్తే దాని లెక్క తెలుస్తుంది. స్వచ్చ పన్ను అంటూ కొత్తగా సేవాపన్ను రూపం లో రాబట్టడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.
నవంబర్ 15 నుంచీ ఈ పన్ను అమల్లోకి వస్తుంది. నిజానికి ఈ స్వచ్చ పన్ను విషయం ఐడియా ఇచ్చిందీ, అమలయ్యేలా చేసిందీ తెలుగు దేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే అన్ని అంటున్నారు. ఏపీ లో ఆర్టీసీ ఛార్జీలు బాగా పెరిగే పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ లో పెట్రోల్ ధరలు కూడా ఎక్కువే. ఏపీ ని పన్నుల పరంగా బాగా జుర్రుకుని ఖజానా నింపాలి అనేది బాబు గార ప్లాన్. ఏపీ తో పాటు దేశానికి కూడా వాత లాంటి ఈ స్వచ్చ పన్ను అంశాన్ని ఆయనే మోడీ సర్కారుకు అందించారు. స్వచ్చ భరత్ కి సంబంధించిన పలు కీలక కమిటీలలో చంద్రబాబు నాయకత్వం వహించారు అలా సాగిన ఒక సమావేశం లో ఈ స్వచ్చ పన్ను గురించి వారి దగ్గర బాబు గారు ప్రశావానకి తీసుకురాగా మోడీ సర్కారు అప్పటికే ఎలా ఆదాయం తీసుకుని రావాలా అని చూస్తూ ఉన్న సమయం లో దీనికి కూడా ఓకే అనేసింది. తన వంతుగా నిర్ణయం బాబు కేంద్రానికి అందజేయగా చాలా పెద్ద విచారణ వివరణ తరవాత దీన్ని అమలు లోకి తీసుకుని వచ్చారు కేంద్రం వారు.