కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనె దేవాలయాల పాలక మండళ్ల చైర్మెన్‌లు మారిపోతుంటారు. ప్రభుత్వంమారిన వెంటనే ఛైర్మెన్‌లు రాజీనామాలు చేయడం పరిపాటి. కాని టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుదాయర్ యాదవ్ మాత్రం రాజీనామా చేయనని అవసరం అయితే పాలక మండళిని రద్దుచేసుకోమంటూ సంచలన వ్యాఖ్యలు చేవారు. అయితే అప్పుడే ఏమయ్యిందో ఏమోగాని ఛైర్మెన్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌కు పంపించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత… గత ప్రభుత్వ హయాంలో నియమించిన రాష్ట్రంలోని వివిధ ఆలయాల పాలక మండళ్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఈదే సమయంలో కొన్ని ఆలయాలన పాలక మండళ్ల ఛైర్మన్లు, సభ్యలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఓవైపు పుట్టాపై వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.
కొత్తగా ఏర్పడిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైవీసుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెల 22వ తేదీన ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే పలువురు టీటీడీ బోర్డు సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీటీడీ బోర్డు కొత్త సభ్యులు కూడా అదే రోజు ప్రమాణ స్వీకరం చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
