2014 కు ముందు కాంగ్రెస్ చేసిన తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకుంది కాంగ్రెస్. వైఎస్ మరణం తరువాత జగన్ పై అక్రమాస్తుల కేసుల మోపి జగన్‌ను జైలుకు పంపించింది కాంగ్రెస్. రాష్ట్రాన్ని ఒక పద్దతి లేకుండా విభజించిన కాంగ్రెస్ 2014 లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ భూస్థాపింతం అయ్యింది.
అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ అధిష్టానానికి జ్ణానోదయం అయినట్లుంది. జగన్‌కు చేసిన ద్రోహం తెలసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు జగన్‌తో దోస్తీకి సిద్దమవుతోంది. 11న జరిగిన ఎన్నికల్లో వైసీపీదే అధికారం అని తేలిపోవడంతో కాంగ్రెస్ జగన్ సపోర్ట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. కేంద్రంలో ఏపార్టీకి మెజారిటి రాకపోతె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అప్పుడు ప్రాంతీయ పార్టీలే ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఏపార్టీ కూడా స్పష్టమైన మెజారిటీ రాదని సర్వేలు చెప్పడంతో కాంగ్రెస్ ఇప్పటినుంచె మద్దతు కూడగట్టుకొనేందుకు పావులు కదుపుతోంది.
దీనిలో భాగంగానె జగన్ తో సయోధ్య కోసం రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ మద్దతి ఇస్తే తప్పుడు కేసులు పెట్టినట్లు అంగీకరిస్తామని, తాము అధికారంలోకి వస్తే కేసులను క్లోస్ చేస్తామని, జగన్ కోరినట్లుగా ప్రత్యేక హోదా ఇస్తామని, అందుకోసం గులాం నబీ ఆజాద్ ను రాయబారానికి వినియోగించుకుంటున్నట్లు సమాచారం.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు జగన్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం జగన్ గురించి కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ మాట్లాడవద్దని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీవర్గాలనుంచి సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.