- Advertisement -
తమిళ నటుడు, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధి కెప్టన్ విజయ్ కాంత్ రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ పై కామెంట్లు చేసి అభిమానుల ఆగ్రహాన్ని చవి చూసిన విజయ్ కాంత్… ఇప్పుడు మీడియాపై దూకుడుగా ప్రవర్తించారు.
బుధవారం సేలంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో జర్నలిస్టులపై విరుచుకుపడ్డాడు విజయ్ కాంత్. ఓ జర్నలిస్టును అయితే చెంపదెబ్బ కొడతానంటూ బెదిరించాడు కూడా.
దీంతో ఈ చర్యలను ఇతర రాజకీయపార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుందుకు ప్రయత్నిస్తున్నాయి. విజయ్ కాంత్ డిఎండికె, పీడబ్య్లూ ఎఫ్ ఉమ్మడి అభ్యర్ధిగా ఉల్లుందూర్ పేట్ నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు.