చంద్రబాబు అండ్ బ్యాచ్ మొత్తం కూడా నానా రకాల అబద్ధాలూ…..నానా పాట్లూ పడి సాధించిన ఫలితాన్ని అప్పనంగా జగన్‌కి కట్టబెట్టేసేలా ఉన్నాడు రమణదీక్షితులు. అదే ఇప్పుడు పచ్చ బ్యాచ్ గుండెల్లో గుబులు రేపుతోంది. అందుకే కేవలం ఒక చిన్న మీటింగ్‌కే నోరున్న పచ్చ బ్యాచ్ నాయకులు, పచ్చ మీడియా జనాలందరూ కూడా హాహాకారాలు చేస్తున్నారు. ఎక్కడ హిందూ ఓట్లు అన్నీ దూరమయిపోతాయన్న భయంతో ఏకంగా ఆ వెంకన్నకే జగన్ ఏదో చెడు తలపెట్టబోతున్నాడు అనే రేంజ్‌లో రెచ్చిపోతున్నారు.
కులం పేరుతో వెంకన్న చౌదరి అని పచ్చ బ్యాచ్ నాయకులు అన్నా, బాబుగారు బూట్లు వేసుకుని కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేయడం గట్రా చేసినా, ఇతర మతాల ప్రచార సభలు నిర్వహించిన వ్యక్తిని టిటిడి ఛైర్మన్‌గా నిర్వహించినా పచ్చ బ్యాచ్ మొత్తానికి తప్పుగా కనిపించదు. కానీ జగన్ మాత్రం పూర్తి భక్తి శ్రధ్ధలతో పుష్కరాల సమయంలో చిత్తశుద్ధితో పూజలు చేసినా, అత్యంత భక్తి శ్రధ్ధలతో పూజలు చేసినా మొత్తం హిందూ మతానికే ఏదో జరిగిపోతోంది అనే రేంజ్‌లో రెచ్చిపోతారు.
ఇక దేవాలయాల్లో పూజారులకు కూడా జీతభత్యాలు, కొడిగట్టిపోతున్న దేవాలయాల్లో దీపారాధన పథకం కింద నిధులు కేటాయించిన వైఎస్ కూడా వీళ్ళ దృష్టిలో హిందూ వ్యతిరేకినే. పూజారుల ఉద్యోగుల ఊడగొడతా అనే చంద్రబాబు, ఆ బాపనోడిని నాలుగు తంతే అన్నీ నిజాలు బయటికొస్తాయి అని వాగే పచ్చ నేతలు మాత్రం హిందూ మత ఉద్ధరణకు జన్మించిన కారణజన్ములు అవుతారు. ఇలాంటి విషప్రచారంతోనే 2014 ఎన్నికల సమయంలో కొంతమంది హిందూ ఓటర్లను అయినా జగన్‌కి దూరం చేశారు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో టిటిడిలో జరుగుతున్న దారుణాలు, దొంగతనం స్వామివారి నిధులు కైంకర్యం చేస్తున్న విధానాన్ని వెల్లడించిన రమణదీక్షితులు పచ్చ బ్యాచ్ విషప్రచారం మొత్తానికే గండికొట్టేలా ఉన్నాడు.
పచ్చ పార్టీ జనాల దేవతావస్త్రాల వెనుక నిజాలను ప్రజలందరికీ తెలియచేసేలే ఉన్నాడు. అందుకే పచ్చ బ్యాచ్ మొత్తం గగ్గోలు పెడుతోంది. అయినా అధికార పార్టీ వళ్ళ అన్యాయం జరిగిన ప్రజలందరూ కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కలవడం తప్పా? ఫాతిమా కాలేజీ విద్యార్థులతో సహా పాదయాత్రలో జగన్‌ని కలుస్తున్న అందరూ కూడా అలాంటివారే కదా. చంద్రబాబు, లోకేష్‌ల నేతృత్వంలో టిటిడిలో జరుగుతున్న అరాచకాలు బయటపెట్టిన పాపానికి రమణదీక్షితులును టిటిడి నుంచి తొలగించడంతో పాటు. ఆయన వయసును కూడా గుర్తించకుండా నానా దుర్భాషలు, లేకి మాటలు మాట్లాడుతూ హింసిస్తూ ఉంటే రమణదీక్షితులు ఏం చేయాలి? మౌనంగా పడి ఉండాలా? ఆయన హక్కుల కోసం ఆయన పోరాడడం తప్పవుతుందా? అంటే బాబు బ్యాచ్ జనాలందరూ కొట్టినా, తిట్టినా ఇతరులంతా కూడా పడి ఉండాలా? ఇదేమైనా రాచరికమా?
వైఎస్‌లు హిందూ మత విధ్వంసకులు, నారా వారు హిందూ మతోద్ధారణకు పుట్టిన కారణజన్ముడు అని చేసిన విషప్రచారినికి గండిపడి ఎక్కడ హిందువుల ఓట్లు 2019 ఎన్నికల్లో జగన్‌కి అత్యధిక సంఖ్యలో పడతాయో…..ఎక్కడ అధికారం పోతుందో అన్న భయం తప్ప పచ్చ బ్యాచ్ హాహాకారాలకు వేరే కారణం ఏదైనా కనిపిస్తోందా?