ఇటివలే ప్రముఖ వ్యాపార వేత్త రామోజీరావు మనవరాలు సహరి వివాహ వేడుక రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగింది. ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ల పెద్ద కుమార్తె సహరి. భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా కొడుకు రేచస్ వీరేంద్రదేవ్‌కి ఇచ్చి వివాహం జరిపించారు.
ఈ పెళ్లి వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కూడా ఈ వివాహానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వివాహ వేడుకకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు. ఆయన నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక జగన్ వెంట భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. అంతే కాకుండా ఈ వేడుకలో జగన్ రామోజీరావును కలిసి.. కాసేపు మాట్లాడారు.
అలానే తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, చిరంజీవి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రాజమౌళి, త్రివిక్రమ్, దిల్ రాజు, బాలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు.