Sunday, May 4, 2025
- Advertisement -

కేర‌ళ‌ను హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ శాఖ‌..

- Advertisement -

ఆగ‌స్టులో కేర‌ళ‌ను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. ఈ వ‌ర‌ద‌ల్లో 4వందల మందికి పైగా మృతి చెందారు. 3లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. వ‌ర‌ద‌లు రాష్ట్రానికి భానీ న‌ష్టాన్ని మిగిల్చాయి. భారీవ‌ర్షాల‌తో కోలుకుంటున్న కేర‌ళ‌కు మ‌రో ప్ర‌మాదం వెంటాడుతోంది.భారత వాతావరణ విభాగం(ఐఎమ్‌డీ) సమాచారం ప్రకారం రానున్న అక్టోబర్ 6, 7తేదీల్లో కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు.

ముఖ్యంగా ఇడుక్కి, పలక్కాడ్, త్రిసూర్ జిల్లాలకు జిల్లాలో అక్టోబర్ 7న ప్రకటించారు. అక్టోబర్ 6వరకు సాధారణ వర్షాలు పడతాయని, అప్పటివరకూ ఎల్లో అలర్ట్ ప్రకటన వచ్చిటన్లు కేరళ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్‌ బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తీర ప్రాంతాలకు ఎవ్వరూ కూడా చేపల వేటకు వెళ్లవద్దని, రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన మూడు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరదల సమయంలో సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర బలగాలకు రాష్ట్రానికి పంపాలని కోరారు. అలాగే పర్వత ప్రాంతాలకు పర్యాటకులు రావొద్దని ఆయన సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -