తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు సీఎం రేవంత్. జూన్ 2న ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేసీఆర్ కు ప్రత్యేకంగా లేఖ రాశారు.
అంతేగకాదు కేసీఆర్‌కు స్వయంగా ఆహ్వాన పత్రికను అందించాలని ప్రోటోకాల్ సలహాదారు వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు సూచించారు. కేసీఆర్ గజ్వేల్ ఫామ్ హౌస్ లో ఉన్నారని సిబ్బంది తెలపడంతో అక్కడికి వెళ్లి స్వయంగా ఆహ్వాన పత్రిక, లేఖను అందించనున్నారు అధికారులు.
ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణకు రానున్నారు. జూన్ 2న ఉదయం 9 గంటలకు ఆమె హైదరాబాద్ చేరుకుంటారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో సోనియా గాంధీ ప్రసంగించనున్నారు.