Wednesday, May 7, 2025
- Advertisement -

సరస సల్లాపాల్లో మామా అల్లుళ్లు..!

- Advertisement -

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వాచాలత్వంతో మహిళాలోకం తలదించుకునేలా చేశారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా విరుచుకుపడ్డారు. ఆయన అల్లుడు, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్‌ కూడా మహిళలతో సన్నిహితంగా మెలిగేవారంటూ ఆరోపించారు.

మామా అల్లుళ్ళిద్దరూ సరస సల్లాపాలతో మహిళా ప్రపంచాన్ని అవహేళన చేశారని రోజా దుయ్యబట్టారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేల తనయులు కూడా ఇదే బాటలో సాగుతున్నారంటూ రోజా విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో విఫలమైన చంద్రబాబు.. మహిళలపై వేధింపుల్లో మాత్రం ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ తెచ్చారని రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కీచక పర్వం జరుగుతోందని.. 23 నెల బాబు పాలనలో మహిళలు అభద్రతతో బతుకీడుస్తున్నారని అన్నారు. సినిమా ఆడియో ఫంక్షన్‌లో బాలకృష్ణ ప్రసంగాన్ని, నారా లోకేశ్‌ అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను రోజా ఈ సందర్భంగా మీడియాకు చూపారు. సుశీల్‌ వ్యవహారంలో మంత్రి రావెలను, రాజధాని భూముల దందాలో మరో మంత్రి నారాయణలను బర్త్‌రఫ్‌ చేయాలని రోజా డిమాండ్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -