Wednesday, May 7, 2025
- Advertisement -

సెటైర్లే సెటైర్లు: పవన్ కల్యాణ్ ను ఆడేసుకొంటున్నారు!

- Advertisement -

మొత్తానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆయన రాజకీయ ప్రత్యర్థులు.. రాజకీయ, సామాజిక విశ్లేషకులు.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పవన్ తీరును వారు తప్పుపడుతున్నారు.

పవన్ పై తీవ్ర స్థాయి వ్యాఖ్యానాలతో చెలరేగుతున్నారు. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ ట్విటర్ లో ప్రత్యేక హోదా అంశం గురించి స్పందించినప్పటి నుంచి ఆయనపై విమర్శలు మరింత పెరిగాయి.

ఇప్పటి వరకూ పవన్ ఎప్పుడు ప్రశ్నిస్తాడు? అనే ప్రశ్న మాత్రమే వినిపించేది. అయితే ఇప్పుడు ఆయన ప్రశ్నించలేను అని చెప్పేశాడు కాబట్టి.. విమర్శలకు పదును పెరిగింది. పవన్ కల్యాణ్ అమ్ముడు పోయాడని.. ఆయన ప్యాకేజీ కల్యాణ్ అని.. అందుకే ఇప్పుడు ప్రశ్నించడంలేదని రాజకీయ ప్రత్యర్థులు అంటున్నారు. పవన్ కు తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలతో ఒప్పందాలున్నాయని అందుకే ఇప్పుడు ఆయన ప్రశ్నించలేకపోతున్నాడని.. వారు అంటున్నారు.

ప్రత్యర్థుల విమర్శల సంగతి అలా ఉంటే.. రాజకీయ విశ్లేషకులు కూడా పవన్ ఇలా ప్రకటించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు కాకపోతే పవన్ ఇంకెప్పుడు ప్రశ్నిస్తాడు? రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. ఏ కారణాల చేత ఆయన ప్రశ్నించలేకపోతున్నాడు? అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ అంశం ఎంతైనా పవన్ ను ఇబ్బంది పెట్టేదే! జనాలు బాగాసీరియస్ గా తీసుకొన్న అంశంలో ఇలా పేలవమైన స్పందన ద్వారా పవన్ వారి ని తీవ్రంగా నిరాశపరిచాడు. పక్కా తెలుగుదేశం, బీజేపీల మనిషిగా వారి మీద ఉండే వ్యతిరేకతను తనుకూడా సొంతం చేసుకొంటున్నట్టుగా ఉన్నాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -