నంద్యాల ఉప ఎన్నిక ఎంపిక కథ క్లైమాక్స్‌కు చేరింది. ఇప్పటి వరకు టికెట్ ఎవరికి కేటాయించాలో ఉన్న సస్పెన్స్ తొలగిపోయింది. ఎట్టకేలకు భూమా కుటుంబానికే టికెట్టును సీఎం చంద్రబాబు కేటాయించినట్లు సమాచారం. దీంతో టికె ట్ కోసం ఆశిస్తున్న శిల్పా మొహన్‌రెడ్డికి చుక్కెదురైంది.ఇక చేసేది ఏమిలేక పార్టీ మారే యేజనలో ఉన్నట్లు సమాచారం.
భూమానాగిరెడ్డి మృతితో కాలీ అయిన నంద్యాల నియేజకవర్గ ఉప ఎన్నిక టీడీపీలో ఎంత చిచ్చురేపిందో అందిరికీ తెలిసిందే. అప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు టికెట్టు కేటాయింపులో ఒక్క సారగా బగ్గుమన్నాయి. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి విషయంలో పార్టీలోని లుకలుకలు తారాస్థాయికి చేరాయి. ఈ టికెట్ ను సంపాదించుకునేందుకు ఇప్పటికే నాలుగు వేర్వేరు గ్రూపులు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అందరికంటే ప్రతిష్టాత్మకంగా పార్టీ సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి టికెట్ కోసం ముందు నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఎన్ని ప్రయత్నాలు చేసినా పలితంలేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం..
టికెట్ దక్కకపోతే పార్టీ వీడటమే కాకుండా సొంతంగా బరిలోకి దిగనున్నట్లు సన్నిహితులతో ప్రకటించిన సంగతి తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ను భూమా కుటుంబ సభ్యులకే ఆ టిక్కెట్ కేటాయించారన్న వార్త పార్టీ వర్గాల్లో పరచారం జరుగుతోంది. పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో శిల్పా మోహన్ రెడ్డి అమరావతిలో చంద్రబాబుతో సమావేశమయ్యి చర్చలు జరిపినా పలితం లేకపోవడంతో శిల్పామోహన్‌రెడ్డి అవాక్కయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.
పార్టీ టిక్కెట్ తో పోటీ చేసే అభ్యర్థిని గెలిపించేందుకు అందరూ కలసి కట్టుగా పని చేయాలని మోహన్ రెడ్డికి బాబు స్పష్టంగా ఆదేశించారని తెలుస్తోంది. పార్టీ టికెట్ దక్కకపోతే తాను పార్టీ వీడతానని ఇప్పటికే ప్రకటించిన శిల్పా మోహన్ రెడ్డి తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టినప్పటికీ ఫలితం లేదని సమాచారం. ఉప ఎన్నిక టికెట్టు విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా దక్కకపోవడంతో చివరి ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఎన్ని ప్రయత్నాలు చేసినా పలితం ఉండదని టీడీపీ వర్గాలు అంటుండటంతో … ఉప ఎన్నికలో సత్తా చాటుకోవాలని భావించిన శిల్పా ఇప్పుడ అయేమయంలో పడ్డట్టు సమాచారం. టికెట్టు దక్కకపోతే స్వతంత్ర అభ్యర్తిగా పోటీచేస్తాననీ లేకపోతే వైసీపీలోకి వెల్తానని ప్రకటించిన విషయం తెలిసందే. త్వరలోనే అన అనుచరులతో సమావేశ మయ్యి ఏదోక నిర్ణయం తీసుకొవాలని భావిస్తున్నారు.
Related