Tuesday, May 6, 2025
- Advertisement -

టీడీపీ దెబ్బ‌కు కుప్ప‌కూలిన స్టాక్ మార్కెట్ల్‌..

- Advertisement -

కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం భారతీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎన్డీయేలో అతి పెద్ద భాగస్వామి అయిన టీడీపీ ఆ కూటమి నుంచి బయటకు రావడం, అవిశ్వాస తీర్మానాన్ని సైతం పెట్టడంతో… దేశవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది.

ఈ రాజకీయ అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో, ఇవాల్టి ట్రేడింగ్ ముగిసే సమయానికి… సెన్సెక్స్ ఏకంగా 510 పాయింట్లు పతనమై 33,176కు పడిపోయింది. నిప్టీ 165 పాయింట్లు కోల్పోయి 10,195కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జై ప్రకాశ్ అసోసియేట్స్ (9.14%), సింటెక్స్ ఇండస్ట్రీస్ (8.85%), ఎంఎంటీసీ లిమిటెడ్ (8.29%), వక్రాంగీ (4.73%), అదానీ ట్రాన్స్ మిషన్ (4.33%).

టాప్ లూజర్స్:
క్వాలిటీ (-7.15%), ఎన్ఐఐటీ (-6.25%), గేట్ వే డిస్ట్రిపార్క్స్ (-5.84%), కాక్స్ అండ్ కింగ్స్ (-5.81%), బాంబే బుర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ (-5.58%).

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -