వక్ఫ్ సవరణ చట్టం 2025పై విచారణను మే 20కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. వక్ఫ్ సవరణ చట్టం 2025కి వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అయితే ప్రధాన పిటిషన్‌పై ఇంకా పూర్తి వాదనలు జరగాల్సి ఉండటంతో తదుపరి విచారణను మే 20, 2025కి వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా…పూర్తి విచారణ ముగిసే వరకు కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ చట్టం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోదని కోర్టును కోరారు. ఇప్పటివరకు ఈ కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయ్ మరియు న్యాయమూర్తి ఎ.జి. మసీహ్ ఉన్న నూతనంగా ఏర్పాటైన ధర్మాసనం చేపడుతోంది.
వాదనలు ముగిసేలోపు ఎవరైనా అధికారపరంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తే…అవసరమైతే కోర్టు ముందుగానే జోక్యం చేసుకోవచ్చని సూచించారు గవాయ్.
పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.