Saturday, May 3, 2025
- Advertisement -

రాష్ట్రపతికి సుప్రీం కీలక ఆదేశాలు

- Advertisement -

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌లు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే బిల్లులను కాలపరిమితిలోపే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అంతేగాదు ఇందుకు సంబంధించిన కాలపరిమితి మూడు నెలలు అని పేర్కొంది.

గవర్నర్‌లు పంపిన బిల్లులపై రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పడం ఇదే తొలిసారి. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ తమ విధులను సముచిత సమయంలో నిర్వహించని సందర్భాలలో కోర్టులు జోక్యం చేసుకునే అధికారం లేకుండా ఉండవని స్పష్టం చేయాలని అనుకుంటున్నాం అని న్యాయస్థానం అభిప్రాయపడింది.

గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాయని… ప్రజల ప్రయోజనాలు, శ్రేయస్సు, వారి ముఖ్యమైన పరిగణనలను కాపాడుతుందని మేము ఆశిస్తున్నాము, విశ్వసిస్తున్నాము అని ధర్మాసనం పేర్కొంది. గవర్నర్ ద్వారా బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేస్తే, రాష్ట్రపతి దానికి అనుమతిని నిలిపివేసినప్పుడు… ఈ కోర్టు ముందు అటువంటి చర్యను సవాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది అని కూడా సుప్రీం కోర్టు తెలిపింది. తమిళనాడులో పలు బిల్లులను పెండింగ్‌లో పెట్టడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -