మొదటగా రేవంత్ రెడ్డి మాత్రమే అనుకొంటే.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఇరుక్కొన్నారు. బాబు గారు ‘వి విల్ హానర్ యూ” అంటూ స్టీఫెన్ సన్ కు హామీ ఇచ్చారు. స్వేచ్ఛగా ఓటేయాలని.. తద్వారా తమకు అండగా నిలవాలని అంటూ బాబు గారు ఆ నామినేటెడ్ ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారని టేపుల ద్వారా బహిర్గతం అవుతోంది.
మరి ఈ వ్యవహారంలో బాబు గారు బాగానే ఇబ్బంది పడుతున్నారు. అధినేత ఇలాంటి ఇబ్బందుల్లో ఉంటే.. తెలుగుదేశం నేతలు మాత్రం ఆయనను డిఫెండ్ చేసుకోవడంలో అంత సక్సెస్ కావడం లేదు!
మొదటగా రేవంత్ రెడ్డి వ్యవహారం గురించి స్పందించడానికే తెలుగుదేశం నేతలు భయపడ్డారు. ఏం మాట్లాడితే ఏమొస్తుందో.. అనే భయంతో మూడు నాలుగు రోజుల పాటు తెలుగుదేశం నేతలు ఎక్కడివారక్కడ ఉండిపోయారు. ప్రపంచంలో ఏ ఇష్యూ మీదనైనా ఇట్టే స్పందించేసే తెలుగుదేశం నేతలు రేవంత్ రెడ్డి వ్యవహారంలో మాత్రం ఆచితూచి స్పందించారు. ఇక బాబుగారి టేపుల విషయానికి వస్తే.. ఇక్కడ టీడీపీ నేతలు రెండు మాటలు మాట్లాడుతున్నారు.
మొదటిదేమో.. ఏపీ సీఎం ఫోన్ ను ట్యాప్ చేయడం దారుణం అనే మాట! అది నేరం అని.. దానిపై చర్యలు తీసుకొంటామని ఏపీ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ప్రకటనలు చేసుకొంటూ వచ్చారు. బాబు ఫోన్ ట్యాప్ చేయడం కుట్ర అని వారు అన్నారు. ఇక మరో మాట ఏమిటంటే.. అసలు అది బాబుగారి వాయిస్ కాదు అనడం. మిమిక్ర చేయించారు.. పదాలను అతికించి ఆ టేపులను తయారు చేశారు.. అనే మాటల ద్వారా తెలుగుదేశం నేతలు ఆ ఆడియో టేపులు ఫేక్ అనేమాటల చెప్పే ప్రయత్నం చేశారు. మరి తెలుగుదేశం నేతలు ఒక మాటకు కట్టుబడి ఉండలేకపోయారు. ట్యాపింగ్ చేయడం దారుణం అనేమాటను ఒకసారి, అది మిమిక్రీ ఆడియో అంటూ మరో మాట మట్లాడుతూ.. బాబును రక్షించలేక, డబుల్ టోన్ తో తాము కూడా విమర్శల పాలవుతున్నారు!