ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో ఉన్న రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. స్టూడియోకు ఇచ్చిన 15.17 ఎకరాల భూములను ప్రభుత్వం తిరిగి ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని తెలిపింది. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రామానాయుడు స్టూడియోకు 2003 సెప్టెంబరులో భూములు కేటాయించారు.
చంద్రబాబునాయుడే విశాఖపట్నంలో ఉన్న 35 ఎకరాల అందమైన హిల్టాప్ భూమిని కేవలం ₹5.2 లక్షలకే ఎకరా చొప్పున కేటాయించారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
అభివృద్ధికి మద్దతు ఇవ్వడం కంటే, చరిత్ర కలిగిన సంస్థలను అణిచివేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుందనే భావన కనిపిస్తోంది. సినీ పరిశ్రమకు ఎంతో విలువైన స్టూడియో ప్రాముఖ్యతను ప్రశ్నించడం ద్వారా, విశాఖలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడంపై ఆసక్తి లేదని ఈ ప్రభుత్వం సూచిస్తోంది. సురేశ్ బాబుపై ఒత్తిడి పెంచడానికి చేస్తున్న రాజకీయ కుయుక్తి మాత్రమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టపరమైన సమస్యలు, రాజకీయ వివాదం నేపథ్యంలో ఇప్పుడు స్టూడియో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.