- Advertisement -
తాము అధికారంలోకి వస్తే మద్యపానం పై నిషేధం విధిస్తామన్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వర ప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
జగన్ కు మద్యపాన నిషేధం పై పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వైసీపీ పార్టీ ఓ సంస్ధ అని అన్నారు. జగన్ కేవలం ఓదార్పు యాత్రలు చేయడానికే పరిమితమయ్యారని, జగన్ కు పాలన గురించి తెలియదని ఆయన అన్నారు.
బహుశా ఒకానొక దశలో ఫ్యాన్ గాలి కిందకు వచ్చేందుకు సిద్దమైన డొక్కా తన గురువు రాయపాటి సాంబశివ రావు చొరవతో సైకిల్ ఎక్కిన సంగతి తెలిసిందే.