- Advertisement -
అందరూ వెళ్లిపోయారు. పచ్చదనం పాలిపోయింది. తెలంగాణలో గులాబీ ముళ్లు గుచ్చుకున్నతెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబుతో నలుగురు అగ్ర నాయకులు భేటీ అయ్యారు.
బుధవారం హైదరాబాద్ లో చంద్రబాబును రేవంత్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, పెద్దిరెడ్డి, నర్సారెడ్డి కలుసుకుని పార్టీ పరిస్థితులపై చర్చించారు. ఆ నలుగురే మిగిలిన తెలంగాణలో పార్టీని ఎలా పటిష్ట పరచాలో తీవ్రంగా చర్చించారట.
తెలంగాణాలో టిటిపి పునాదులు గట్టివని, ఎదురుదెబ్బలు తగిలినా పార్టీని కాపాడుకుందామని చంద్రబాబు ఆ నాయకులతో అన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో కమ్మగా వెలిగిపోతున్న పార్టీకి ఇక్కడ నలుగురు రెడ్లే మిగలడం మహా విషాదం.