ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య భారీ ఎత్తున జరిగిన మూడు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. అధికారంలో ఉన్న టీడీపీలో మంచి జోష్ ని నింపాయి. ఈ పలితాల్లో వైసీపీ వెనక్కి తగ్గింది. మూడు చోట్లా టీడీపీ విజయం సాధించినా అనుకున్న స్థాయిలో మెజార్టీ లేకపోవడం ఆ పార్టీ వర్గాలను బానే బాధపెట్టినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి 125 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు అని అందరూ లెక్కలు వేశారు.
అయితే నిజానికి ఆయనకు 87 ఓట్ల మెజార్టీ మాత్రమే రావడం జరిగింది. ఇక్కడ టీడీపీ శిబిరంలో ఉన్న అభ్యర్థులకు చివరకు పోల్ అయిన ఓట్లకు టాలీ చేసుకుంటే టీడీపీ శిబిరంలో ఉన్న వాళ్లలో 45 ఓట్లు వైసీపీకి క్రాస్ అవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దాంతో టీడీపీ విజయం సాధించామన్న అనందం కన్నా వెన్నుపోట్లు నాయకులు ఎవరో కనిపెట్టే పనిలో పడింది. టీడీపీ శిబిరంలో దాదాపు 515 మంది ఓటర్లు ఉండగా ఇప్పుడు వాకాటి నారాయణ రెడ్డి 465 ఓట్లు పడ్డాయి. 8 ఓట్లు మురిగిపోయాయి.
ఒక ఓటు నోటాగా నమోదు అయింది. వీటిని పక్కన పెట్టిన ఖచ్చితంగా 45 ఓట్లు వైసీపీ అభ్యర్ధికి క్రాస్ ఓటింగ్ జరిగింది. దీంతో వీరంతా ఎవరి ఒత్తిళ్ల మేరకు క్రాస్ ఓట్ చేశారని జిల్లా టీడీపీ నాయకులు ఆరా తీస్తున్నారు. ఇక కడప రిజల్ట్ పర్వాలేదు. కర్నూలు జిల్లాలో సైతం టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి 100 ఓట్ల పైగానే మెజార్టీతో ఘనవిజయం సొంతం చేసుకుంటారని అనుకున్న చివరకు 56 ఓట్ల మెజార్టీకే పరిమితమయ్యారు. దాంతో కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో టీడీపీకి చాలామంది వెన్నుపోటు పొడిచినట్టు అర్ధం అవుతోంది. మెజార్టీ తగ్గడంపై చంద్రబాబు కూడా బానే సీరియస్ అయినట్లు తెలుస్తోంది.