నంద్యాల ఉప ఎన్నిక బాబు రాజకీయ అనుభవానికి సవాల్‌లాంటిది. గెలవకపోతే బాబుపై నమ్మకం తగ్గిపోతుంది. అందుకే గెలపుకోసం అతి పెద్ద వ్యూహాన్ని అయలు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల్లో గెలవాలని ఇన్‌ఛార్జ్ మంత్రులకు ఆల్టిమేట్టం ఇచ్చారు. అందుకే ఉప ఎన్నిక భారం అంతా కేయీ బ్రదర్స్‌కు ఇచ్చారు.
ఎన్నికలో ఓటమి బయంతోనే బాబు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒక వైపు ఏకగ్రీవం అంటూ రాయబారం నడుపుతూ…. మరో వైపు గెలవటానికి అనుసరించిన వ్యూహాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తాజాగా మంత్రి కేయీ మాటలు వింటే అలానే అనిపిస్తోంది. నంద్యాల ఉపఎన్నిక విషయంలో జగన్ పోటీ పెట్టకూడదంటూ బ్రతిమలాడుకున్నారు. జగనూ ప్లీజ్ కాస్త ఆలోచించవా’ అంటూ కెఇ వేడుకుంటున్నారు. నిజంగా గెలిచేసత్తా ఉంటే ఇలా బ్రతిమలాడుకోవాల్సిన అవసరం ఏంటి? టిడిపి అధికారంలో ఉంది. అంగ బల్ముం, అర్ధబలమూ ఉంది. అయినా ఎందుకని ప్రతిపక్ష పార్టీ నుండి ఎవరిని పోటీలోకి దింపొద్దని వేడుకుంటోందో అర్థం కావడంలేదు.
ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై కెఇ ఆధ్వర్యంలో విస్తృతస్ధాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సహచర మంత్రులు అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులుతో పాటు మాజీ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ తదితరులు పాల్గొన్నారు. ఏకగ్రీవం కోసం బ్రతిమలాడుతూ… అలా అంటూనే అవినీతి కేసులు ఎదుర్కొంటున్న జగన్ పార్టీలో శిల్పామోహన్ రెడ్డి చేరటం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేయటం గమనార్హం. టీడీపీ ఓటమి భయం పట్టుకుంది.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}TjzBfDWVcks{/youtube}