- Advertisement -
బంగారు తెలంగాణ కోసం అందరూ కలిసి పనిచేయాలని, ఇది రాజకీయ పునరేకీకరణ కావాల్సిన సమయమని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. మల్కాజిగిరి ఎంపి, తెలుగుదేశం నాయకుడు మల్లారెడ్డి బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయనకు శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో ఉన్న వారు, ప్రభుత్వంలో ఉన్న వారే కాదు.. తెలంగాణా ప్రజలందరి లక్ష్యం బంగారు తెలంగాణ సాధించుకోవడమేనని ఆయన అన్నారు. 2019 సంవత్సరం నాటికి తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల కోట్ల ఉండబోతోందని, తెలంగాణ ధనిక రాష్ట్రమని ఆయన అన్నారు.
పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్లు.. ఇప్పుడు వచ్చిన వారు అందరూ కలిసి పని చేయాలని, దీని ద్వారా మన లక్ష్యాలను చేరుకుంటామని ఆయన అన్నారు.