Monday, May 5, 2025
- Advertisement -

జగన్ మోహన్ రెడ్డి కి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనున్న చంద్రబాబు !

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం అనేది లేకుండా చెయ్యడమే చంద్రబాబు ముఖ్య ఉద్దేశ్యం గా కనిపిస్తోంది, దీనికోసం వై ఎస్ జగన్ కి భారీ షాక్ ఇవ్వబోతున్నారు చంద్రబాబు.

ప్రత్యేక హోదా విషయం లో అధికార టీడీపీ కి చికాకుగా మారాడు జగన్ మోహన్ రెడ్డి. ఆయన కి సమయానికి ఒక మంచి ఝలక్ ఇవ్వకపోతే రెచ్చిపోయేలాగా కనిపిస్తూ ఉండడం తో బాబు కొత్త ప్లాన్ లు రచిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి కి సొంత జిల్లాలో నే పట్టు లేదు అనే భావన ప్రజల్లో కలిగించేలాగా చెయ్యడం తో ఆయన మీద గట్టి యజమాయిషీ చెయ్యచ్చు అనేది బాబు గారి ప్లాన్.

తెలంగాణలో తమ పార్టీ నేతల్ని తెలంగాణ అధికారపక్షం ఆపరేషన్ ఆకర్ష్ తో లాగేసుకుంటుదని.. దుర్మార్గానికి పాల్పడుతుందని వాదించే తెలుగుదేశం.. తాను అధికారంలో ఉన్న ప్రాంతంలో.. అదే తీరును అమలు చేయటం గమనార్హం. జగన్ కి సొంత గడ్డ అయిన కడప లో ఒక ఎమ్మెల్యే ని సైకిల్ ఎక్కించే పనిలో తెలుగు తమ్ముళ్ళు చాలా బిజీ గా కనిపిస్తున్నారు. కడప జిల్లా లో చాలా మంది వై ఎస్సార్ ఎమ్మెల్యే లు జగన్ తీరుమీద అసహనం గా ఉన్నారు, తమని పార్టీ పెద్ద పట్టించుకోవడం లేదు అనే భావనతో వారు ఉండడం తో అధికార పార్టీ లో చేరేందుకు ఏడాది క్రితం పావులు పదిపారు, వెంటనే జగన్ జాగ్రత్త పడ్డాడు. 

ఇప్పుడు మళ్ళీ కథ మొదటికి వచ్చింది అధికార పార్టీనే ఆకర్శ మంత్రం తో రమ్మంటూ ఉంటే వెళ్ళిపోవడానికి చాలామందే సిద్దం గా ఉన్నారు అనిపిస్తోంది. తాము కానీ గేట్లు ఎత్తాలే కానీ.. తమ వద్దకు వచ్చేయటానికి పలువురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్న భావన కలిగించేందుకు తెలుగుదేశానికి తాజా చేరిక ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -