Tuesday, May 6, 2025
- Advertisement -

నాలుగు రాష్ట్రాల‌తో పాటు తెలంగాణా ఎన్నిక‌ల షెడ్యూల్‌ విడుద‌ల‌

- Advertisement -

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌పై సస్పెన్స్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. రాజస్థాన్‌తోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఓట‌ర్ల తుది జాబితాపై హైకోర్టులో కేసు ఉన్న నేప‌థ్యంలో ఎన్నిక‌లు జ‌రుగుతాయా లేదా అన్న అనుమానం ఉండేది. ఆ అనుమానాల‌ను ప‌టా పంచ‌లు చేసింది సీఈసీ.

తెలంగాణలో డిసెంబరు 7న ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబరు 11న కౌంటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. తెలంగాణలో ఓటర్ల జాబితాను ప్రకటించడానికి ఇంకా సమయం ఉందని, ఈ నెల 8న ఓటర్ల తుది జాబితాను ప్రకటించాలని భావించినప్పటికీ.. ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్‌ స్పష్టం చేశారు. అయితే, రాజస్థాన్‌తోపాటే అనూహ్యంగా ఆయన తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు.

అక్టోబరు 8న ఓటర్ల జాబితా అంశంపై హైకోర్టు తీర్పు వెల్లడించనుంది.అదే నెల్లో 12వ తేదీలోగా ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసేందుకు కొంత సమయం పట్టవచ్చునని ఆయన చెప్పారు . అటు రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ఈసీ విడుదల చేసింది.

119 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల చివరి తేదీ నవంబర్ 19. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 22.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -