Saturday, May 3, 2025
- Advertisement -

తొమ్మిది నెలల్లో మొత్త ఏరిపారేస్తారట.. టెన్షన్ లో రాజకీయ నేతలు..?

- Advertisement -

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల ను తేల్చే విషయంలో తెలంగాణ కోర్టు ఎంతో పకడ్బందీగా ప్రణాళిక తో వ్యవహరిస్తోంది. హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఉన్న కేసులను తొమ్మిది నెలల్లో విచారణ జరిపి పూర్తి చేయగలమని సుప్రీం కోర్టు కు స్పష్టంగా తెలిపింది.. అమికస్ క్యూరీ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదిక ద్వారా సమర్పించారు. తెలంగాణ హైకోర్టు కార్యాచరణ ప్రణాళికను మిగతా అన్ని హైకోర్టులు ఆదర్శంగా తీసుకోవాలని అమికస్ క్యూరీ కూడా సిఫార్సు చేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు పరిధిలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుల్లో అత్యధికం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన కేసులే ఉన్నాయి. వీటికి సంబంధించిన కేసుల పురోగతిపై పూర్తి సమాచారం తీసుకున్న తెలంగాణ హైకోర్టు ఈ మేరకు తొమ్మిది నెలల్లో విచారణ పూర్తి చేయవచ్చని చెప్పినట్లుగా తెలుస్తోంది.

జగన్ అక్రమ ఆస్తుల గురించి ఎనిమిదేళ్ల నుంచి విచారణ జరగలేదు.. కొన్ని కేసుల్లో స్టే లు తెచ్చుకున్నారు. కొన్ని కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు విచారణ లో ఉన్నాయి. అయితే సిబిఐ దాదాపుగా అన్నింటిలో ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఈడీ కూడా ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. వీటన్నిటి పై అసలు విచారణ జరిపితే త్వరగా కేసులు తేలిపోయే అవకాశం ఉంది. అందుకే తొమ్మిది నెలల్లో విచారణ పూతి చేస్తామని తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చినట్లుగా న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.

నేర చరితుల్ని రాజకీయాలనుంచి తుడిచేస్తేనే రాజకీయ వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉందని చాలాకాలంగా మేధావులు వాదిస్తూ వస్తున్నారు.. క్రిమినల్ మైండ్‌తో ఉండే నేతలు రాజకీయ అధికారం పొందడం వల్ల రాజ్యాంగ ఉల్లంఘనలు జరగడమే కాకుండా.. చట్టాలు, రాజ్యాంగాలను సైతం ధిక్కరించేందుకు వెనుకాడటం లేదు. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని మరింతగా బలహీనం చేస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు చొరవతో.. రాజకీయలు.. తొమ్మిది నెలల్లో క్లీన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న ఆశాభావం ప్రజల్లో కనిపిస్తోంది.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -