Saturday, May 3, 2025
- Advertisement -

తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీ ఫిక్స్!

- Advertisement -

తెలంగాణ ఇంటర్ ఫలితాల తేది ఫిక్స్ అయింది. ఏప్రిల్ 25 లేదా 27న ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుండి 25, 2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడ్డాయి. మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.

మార్చి 18న వాల్యుయేషన్ ప్రారంభం కాగా రాష్ట్రంలోని 19 కేంద్రాల్లో కొనసాగింది. దాదాపు 60 లక్షల పత్రాలు మూల్యాంకనం చేయబడగా రెండు దశల పరిశీలన అనంతరం తుది ఫలితాలను విడుదలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలను tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in వెబ్‌సైట్‌లలో చూడొచ్చు. వెబ్‌లోకి వెళ్లిన తర్వాత Results అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ హాల్ టికెట్ నంబర్ మరియు అవసరమైన వివరాలు ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.

A గ్రేడ్: 75% లేదా అంతకంటే ఎక్కువ, B గ్రేడ్: 60% – 74%, C గ్రేడ్: 50% – 59%, D గ్రేడ్: 35% – 49% ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -