వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ల నొప్పులు రావడం సహజమైపోయింది. ఆహారపు,జీవన శైలీలో మార్పుల వల్ల అనారోగ్యం బారిన పడటమే కాదు మోకాళ్ల నొప్పులతో చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మనం తినే ఆహారంలో ఈఫుడ్‌ని చేర్చితే మోకాళ్ల నొప్పుల సమస్యకు చెక్ పెట్టవచ్చు.
చేపలు మోకాళ్ల నొప్పులను తగ్గించి కీళ్లను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ట్రౌట్, సాల్మన్, సార్డినెస్, మాకేరెల్, హెర్రింగ్, ట్యూనా, పిల్‌చార్డ్స్ వంటి చాపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. వీటి ఫలితంగా కీళ్ల నొప్పులు తగ్గడమే కాదు వాపును కూడా నియంత్రిస్తుంది.
వాల్‌నట్…పోషకాల గనిగా భావించే వాల్ నట్స్ తింటే మోచేతి, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి. ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి యాంటీఆక్సిడెంట్-రిచ్ బెర్రీలు తినండం వల్ల కీళ్లలో మంటను కలిగించే ఆర్థరైటిస్‌ను నిరోధిస్తాయి. క్యారెట్ మోకాళ్ల నొప్పుల సమస్యకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, బి ద్వారా కీళ్లను బలంగా చేస్తుంది. నొప్పి నుండి ఉపశమనం కలిగించడమడే కాదు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.