తెలంగాణ రాష్ట్ర సమితి నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయభేరి మోగించింది. టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి 18వ రౌండ్‌కే గెలుపు సొంతం అయింది. 19వ రౌండ్ ముగిసేసరికే 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపు సొంతం చేసుకున్నారు.
ఈ విషయంపై వేంటనే టీఆర్ఎస్ యువనేత, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ లో పార్టీ అభ్యర్థి విజయంపై ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ చేసిన వేంటనే భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మరియు మెదక్ జిల్లా పార్టీ కార్యకర్తలకు అభినందనలు కేటీఆర్ ట్విట్టర్‌లో ప్రత్యేక కామెంట్లను పోస్ట్ చేశారు.
ఇంత పెద్ద మొత్తంలో పార్టీ అభ్యర్ధి విజయం సాధించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే మంత్రి హరీష్ రావు కూడా టీఆర్ఎస్ పార్టీకి విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు కానుకగా ఈ విజయాన్ని అందించారు అని తెలిపారు.