Sunday, May 4, 2025
- Advertisement -

ఇంతలో ఎంత మార్పు .. అద్వితీయమైన రాజకీయ శక్తి గా ఎదిగిన కెసిఆర్

- Advertisement -

గ్రేటర్ ఎన్నికలు ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం అసలు ఎవరిదీ, దీనికి అసలు సిసలు అధికారం ఎవరికీ చెందుతుంది అనే విషయాల్లో నిర్ణయం చేసి పారేసాయి. మొత్తం నోటా యాభై స్థానాల్లో కెసిఆర్ 107 స్థానాలు కైవసం చేసుకుని తిరుగు లేని రికార్డు సాధించగా. ఎవరి సహాయం కూడా లేకుండా మేయర్ పీఠం ఎక్కబోతున్నారు కెసిఆర్.

గ‌డ‌చిన 18 నెల‌లుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అందిస్తున్న ప‌రిపాల‌నపై ప్ర‌జ‌లు ఎంత సంతృప్తిగా ఉన్నార‌న్న‌ది ఈ ఫ‌లితాల ద్వారా తెలుస్తోంది. అదే స‌మ‌యంలో తెలుగుదేశం, భాజ‌పా, కాంగ్రెస్ వంటి పార్టీల దుష్ర్ప‌చారాన్ని ప్ర‌జ‌లు ఏమాత్రం విశ్వ‌సించ‌లేద‌న్న‌దీ తేల్చిన ఫ‌లితాలివి. తెరాస వార్ వ‌న్‌సైడ్ అనే అభిప్రాయం మొద‌ట్నుంచీ వ్య‌క్త‌మౌతూ వ‌చ్చేది.  

2009 లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అప్పుడు తెరాస డుక్ అవుట్ గా నిలిచి జనం కాంగ్రెస్ కి పట్టం కట్టారు. కాంగ్రెస్ యాభై మూడు, టీడీపీ 46 , ఎం ఐ ఏం 43 , బీజేపీ ఐదు సీట్ లనీ గెలుచుకున్నాయి. కానీ ఈ మాత్రం గ్యాప్ లో కెసిఆర్ తిరుగులేని రాజకీయ శక్తి గా ఎదిగారు. తెరాస అధికారం లోకి వచ్చిన తర్వాత అన్ని ఎన్నికలూ వన్ సైడేడ్ గానే ఉండిపోయాయి. మొత్తం మీద జనాలు అధికారం ఎవరికి ఉంటే వారికే ఓటు వెయ్యాలి అని ఫీల్ అవుతున్నారు అనీ వారి తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని నమ్ముతున్నట్టు తెలుస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -