ఇక ఆన్ లైన్ లో ప్రత్యేక దర్శన టిక్కెట్లు

శ్రీవారి దర్శనానికి ఈనెల 27 నుండి ఆన్ లైన్ లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విక్రయించనుంది.

ఇంటర్నెట్, ఈ-దర్శన్ కౌంటర్లలో టిక్కెట్ల విక్రయాలు జరుగనున్నాయి. బుధవారం నుండి టికెట్ల విక్రయం ట్రయల్ ను టీటీడీ వేయనుంది. ఈనెల 27 నుండి దేశవ్యాప్తంగా 2,500 కౌంటర్లలో టికెట్ల విక్రయాలకు టీటీడీ సిద్ధమైంది.