Sunday, May 4, 2025
- Advertisement -

శుభవార్త : హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ రైళ్ళు

- Advertisement -

శంషాబాద ఎయిర్ పోర్ట్ లో విమానం దిగిన ప్రతీ వారికీ ఊర్లోకి వెళ్ళాలి అంటే పుష్పక్ విమానమో లేక ప్రైవేటు క్యాబో అవసరం అవుతోంది. బస్సులు అరగంటకి ఒకటి అయితే ఉంది గానీ ట్రాఫిక్ ని దాటుకుని ఊర్లోకి వెళ్ళడానికి గంటలు గంటల సమయం పట్టేస్తుంది మరి. సో దీనికి విరుగుడుగా ట్రైన్ రూట్ ఉంటె ఎంతో బాగుండేది అని ప్రతీ హైదరాబాదీ అనుకుంటూ ఉంటారు.

ఎదో ఒక సందర్భంలో ఈ టైపు లో ఆలోచించిన వాళ్ళు లేకపోలేదు. అయితే రైల్వే శాఖ కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టింది. ఇటుపక్కకి రైలు రూటు లేకపోవడం వలన ఎంతగానో నష్టపోతున్నాం అని వారు లెక్కలు వేసుకుంటున్నారు . శంషాబాద్ కి డైరెక్ట్ రైలు రూటు వెయ్యాలి అంటూ ఆ చుట్టూరా ఉన్న భూభాగం అంతా జీఎమ్మార్ వారిది ఫ్యూచర్ లో టెర్మినల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ససేమిరా ఆ ప్రాంతం ఇవ్వం అంటున్నారు వారు.

కొత్త టెర్మినల్స్ ఒస్తే రన్ వే  బోలెడంత కావాల్సి ఒస్తుంది సి అది వారి ఇచ్చే పరిస్థితి లేదు. సో ఇప్పుడు అందరి ఆలోచనా అండర్ గ్రౌండ్ ఎం ఎం టీఎస్ మీద పడింది. హైదరాబాద్ నగరం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు భూగర్భ రైలును ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు సురేష్ ప్రభు . అండర్గ్రౌండర్ ఎంఎంటీఎస్ ట్రైన్ ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు కనెక్ట్ అయ్యేలా చేయటం ద్వారా.. నగరవాసుల వెతలు భారీగా తీరే వీలుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -