Wednesday, May 7, 2025
- Advertisement -

బాబును రక్షించడానికే ఆయన ఫ్యాన్ పరిగెత్తుకు వచ్చాడా..!

- Advertisement -

తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆయన అభిమాని రక్షించేశాడా? అవినీతి వ్యవహారంలో ఇరుక్కొపోతాడు.. కేసును ఎదుర్కొని పదవికే ముప్పును తెచ్చుకొంటాడు.. అనుకొన్నవ్యవహారం నుంచి బాబు ను బయటపడేశారా? బాబును ఆయన అభిమాని అయిన వ్యక్తే రక్షించేశాడా?! అనే అనుమానాలు కలుగుతున్నాయిప్పుడు.

ఉన్నఫలంగా ఢిల్లీ నుంచి వచ్చిన పీయూష్ గోయల్ విషయంలో ఇప్పుడు కొత్త అనుమానాలు రేకెత్తున్నాయి. 

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ముప్పుతప్పదనే అభిప్రాయాలు వినిపించాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో ఏసీకి చిక్కడం..వీడియోల్లో బాబు ప్రస్తావన ఉండటంతో ఏపీ సీఎం కూడా ఈ కేసులో దోషి అవుతాడని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి పీయూష్ గోయల్ రావడం.. ఆయన ముందుగా ఏపీ ముఖ్యమంత్రిని కలవడం, ఆ వెంటనే తెలంగాణ సీఎంను కలవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

బాబుకు, కేసీఆర్ కు డీల్ కుదర్చడానికే గోయల్ ఇచ్చాడని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు పేరును ఏసీబీ కేసులో పెట్టడమా…లేదా.. అనే అంశం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉంది. రేవంత్ రెడ్డి మాటలు అయితే బాబును నిందితుడిగా చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బాబు ఈ వ్యవహారం నుంచి బయటపడటానికి బీజేపీ సహయం అర్థించినట్టుగా..అందుకోసమే గోయల్ వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. గోయల్ బాబుకు బాగా దగ్గర మనిషి దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మరి అసలు కథ ఏమిటో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -