Monday, May 5, 2025
- Advertisement -

వైరల్: భరత్ స్టైల్ లో.. శోభనం ఓత్..

- Advertisement -

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో ఏది జరిగినా వైరల్ కావడానికి క్షణాల కంటే తక్కువ సమయమే పడుతోంది. ఒక యువకుడు తన శోభనానికి ఫ్లెక్సీ బ్యానర్ చేయించి ఏకంగా శపధం లాంటిది చేసేసాడు… ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. క్రియేటివిటీకి హద్దులు.. భరత్ అనే నేనులో మహేష్ బాబు సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన స్టైల్ లో బ్రహ్మచర్యానికి స్వస్తి పలుకుతూ మొదటి యుద్ధానికి సిద్ధ పడుతున్నాను అంటూ… అందులో పెట్టేసి…, అమ్మనాన్నలను త్వరలో నానమ్మ తాతయ్యలను చేస్తానని సవాల్ కూడా చేసేసాడు.

పవిత్రమైన సృష్టి కార్యాన్ని ఏదో ఘన కార్యం లాగా ఏ మాత్రం మొహమాటపకుండా ఇలా ఊరందరిని ప్రచారానికి పిలవడం గురించి పేలుతున్న కామెడీ మామూలుగా లేదు. ఇది సంప్రదాయాలను ఎగతాళి చేయటమే అని విరుచుకుపడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. భరత్ అనే నేను ఓత్ ని ఇలా హాస్యానికి వాడుకోవడం పట్ల మహేష్ ఫాన్స్ కోపంగా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -