150వ సినిమా కన్ ఫ్యూజన్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవికి.. ఈ మధ్య ఓ వింత అనుభవం ఎదురైందని ఆద్యా న్యూస్ కు సమాచారం అందింది. ఓ పని మీద తాజ్ కృష్ణ హోటల్ వెళ్లి తిరిగి వస్తున్న చిరును గమనించిన కొందరు యువకులు… ఫాలో అయ్యారట.
చిరు వాహనాన్ని కూడా వెంబడించి అరుస్తూ కాస్త చిరాకు తెప్పించారట. అయితే.. వారి ‘కండిషన్’ గమనించిన చిరంజీవి.. ఎలాంటి గొడవ పెట్టుకోకుండా అలాగే కార్ ను ముందుకు పోనిచ్చారని… జూబ్లీహిల్స్ లోని బ్లడ్ బ్యాంక్ వరకు వెళ్లగానే ఆ యువకులు తమ దారిలో వెళ్లిపోయారని తెలుస్తోంది.
చివరికి.. ఈ సంఘటనపై తన పర్సనల్ సెక్యురిటీని చిరు అలర్ట్ చేశారని.. ఆ యువకుల వివరాలు వెంటనే తెలుసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం.
అయితే.. చిరంజీవిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఫ్యాన్స్ అయితే ఇలా చికాకు తెప్పించే చాన్స్ లేదు. ఇండస్ట్రీలో కూడా చిరును ఇలా చికాకు పెట్టాలనుకునే వాళ్లు ప్రస్తుతానికైతే లేరు. మరి ఈ పని ఎవరు చేసుంటారు అన్నది.. ఈ విషయం తెలిసిన అందరిలో ఆలోచన పెంచుతోంది.
ఈ ప్రచారంలో నిజం ఏంటో.. అబద్ధం ఏంటో తెలియాలంటే.. మెగా క్యాంప్ నోరు విప్పితే తప్ప సాధ్యం కాదు.