Sunday, May 4, 2025
- Advertisement -

వై.సి.పి నిద్రపోతోందా!?

- Advertisement -

నోటుకు ఓటు కేసులో పరిణామాలు ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠంగా మారిన తరుణంలో వైసిపి నుంచి స్పందనే లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

అసలు ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష పార్టీ ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

అత్యంత కీలకంగా మారిన ఓటుకు నోటు కేసు వివాదాన్ని రెండు రాష్ట్రాల సమస్యగా మార్చడానికి టిడిపి అన్ని విధాల ప్రయత్నం చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసిపి నిద్రపోతోందా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం వ్యక్తిగత వివాదం, రెండు రాష్ట్రాల సమస్య కాదని తెలంగాణ మంత్రి వర్గం, రాజకీయ నాయకులు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రం వైసిపి ఖండించకుండా నిశబ్దంగా ఉండటాన్ని ఏపి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌ లో టిడిపి మంత్రి వర్గం తప్పు చేశామనే భయంతో ఎదురు దాడికి దిగి, ప్రెస్‌ మీట్‌ లు పెడుతూ దీన్ని రెండు రాష్ట్రాల సమస్యగా మారుస్తుంటే ప్రతిపక్షం నిశ్శబ్దం వహించడాన్ని రాజకీయ విశ్లేషకులు ఖండిస్తున్నారు. వైసిపి అధ్యక్షుడు జగన్‌పై, పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నా ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో టిడిపి సంక్షోభంలో పడిపోయింది అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో వైయస్ జగన్ టూరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెలువడే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మరి వై.సి.పి రెండు రాష్ట్రాలలో ఇంత జరుగుతున్నా ఎందుకు సైలెంట్‌గా ఉందో ఎవరికి అంతు పట్టడం లేదు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -