Tuesday, May 6, 2025
- Advertisement -

కేసీఆర్ పిలిస్తే.. బాబు వెళ్తారా?

- Advertisement -

ఓటుకు నోటు వ్యవహారం తర్వాత.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కొన్నాళ్ల క్రితం ఉప్పూ నిప్పులా వ్యవహరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు. కారణాలు పక్కన పెడితే.. ఇద్దరి మధ్యా గతంలో ఉన్న శతృత్వం ఇప్పుడు మచ్చుకు కూడా కనిపించడం లేదని.. 2 పార్టీల నాయకులూ అంగీకరిస్తారు.

అందుకు తగ్గట్టే.. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ ను చంద్రబాబు స్వయంగా ఆహ్వానించడం.. దసరా రోజు ప్రత్యేకంగా కేసీఆర్ కార్యక్రమానికి హాజరవడం అన్ని చకచకా జరిగిపోయాయి.

ఇలా.. కీలక కార్యక్రమానికి ఏపీలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలవడం.. నాయకులకే కాదు.. 2 రాష్ట్రాల ప్రజలకు ఆనందాన్నిచ్చింది. అయితే.. ఇలాంటి దృశ్యమే.. హైదరాబాద్ లో రిపీట్ అయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ తో పాటు.. టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం పేరుతో.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన చండీయాగమే ఇందుకు వేదిక కావొచ్చంటున్నారు.

ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీలను చండీయాగానికి కేసీఆర్ ఆహ్వానించారు. అలాగే.. చంద్రబాబునూ కేసీఆర్ స్వయంగా ఇన్వైట్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే.. బాబు కచ్చితంగా యాగానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకని ఆలోచిస్తే.. 2 కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి.. పూజలు, పునస్కారాలను చంద్రబాబు కచ్చితంగా ఫాలో అవుతారు. ఆ విషయం.. అమరావతి శంకుస్థాపనలో అడుగడుగునా కనిపించింది. ఇప్పుడు కేసీఆర్ నిర్వహించనున్న చండీయాగానికి ఆహ్వానం అందితే.. అదే నమ్మకంతో బాబు అటెండ్ అయ్యే చాన్స్ కనిపిస్తోంది. అలాగే.. తను పిలవగానే ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వచ్చినపుడు.. తనకు చండీయాగానికి ఆహ్వానం అందితే వెళ్లడం మర్యాదగా బాబు భావించే అవకాశం కూడా ఉంది.

అయితే.. కేసీఆర్ తీసుకునే నిర్ణయంపైనే.. మళ్లీ ఇద్దరు ముఖ్యమంత్రులను ఒకే వేదికపై కలవడం ఆధారపడి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -