Monday, May 5, 2025
- Advertisement -

జనసేన తరుపున పోరాడుతాడా..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో చాలా చర్చలే జరుగుతున్నాయి. ఒక పక్క జగన్ ప్రత్యేక హోద కోసం పోరటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మాకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రమని సెలవిచ్చారు బిజెపి పెద్దలు. దాంతో ఆంధ్రప్రదేశ్ లోని పార్టీలు భగ్గుమంటున్నాయి.

ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ కు పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాకుండా మేము అధికారంలోకి వచ్చాక ఇస్తామని చెప్పిన ఆ బిజెపి పెద్దలు నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే అధికార తెలుగుదేశం మాత్రం ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మరోవైపు కేంద్రం తో కయ్యం కంటే సావధానంగా నిధులు రాబట్టుకుంటే నే మంచిదని భావిస్తున్నారు.

ఎన్నికలకు ముందు పవన్ జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి టిడిపి – బిజెపి కూటమి కి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ అడపా దడపా హడావుడి చేసాడు కానీ ఇప్పుడు బిజెపి కుండబద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ,ఇచ్చే పరిస్థితులు లేవని చెప్పిన తర్వాత పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని ఎదురు చూస్తున్నారు. జనసేన తరుపున పోరాడుతారా లేకపోతే మీడియా ముందుకు వచ్చి మాత్రమే హడావుడి చేసి సైలెంట్ అయిపోతాడా చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -