Saturday, May 3, 2025
- Advertisement -

ఎవరినీ వదిలిపెట్టం.. బట్టలు ఊడదీసి నిలబెడతాం!

- Advertisement -

కూటమి నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ‘పోలీసులు టోపీపై ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టండి. TDP నేతలకు సెల్యూట్ కొట్టి, వారు చెప్పినట్లు చేసి అన్యాయం చేస్తే మాత్రం బాగోదు అని హెచ్చరించారు. రేపు మళ్లీ అధికారంలోకి వస్తాం. అన్యాయం చేసిన ఈ అధికారులు, నాయకులందరినీ బట్టలు ఊడదీసి నిలబెడతాం. ఎవరినీ వదిలిపెట్టం. రిటైరైనా, సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.

వంశీ ఎదుగుతున్నాడు, లోకేష్ కన్నా గ్లామర్ గా ఉంటాడు కాబట్టి చంద్రబాబు ఆయనను చూసి తట్టుకోలేకపోయాడు. కొడాలి నాని కూడా చంద్రబాబు కంటే చక్కగా ఉంటాడు. తన సామాజిక వర్గం నుంచి ఎవరైనా ఎదుగుతే చంద్రబాబు జీర్ణించుకోలేడు. కేవలం వాళ్లు మాత్రమే లీడర్లుగా ఉండాలి అనుకుంటారు అని దుయ్యబట్టారు.

విజయవాడ జిల్లా సబ్ జైలులో రిమాండ్ లో వంశీతో ములాఖత్ అయ్యారు జగన్. జగన్ వెంట కొడాలి నాని, పేర్ని నానితోపాటు పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, వంశీని అరెస్ట్ చేసిన తీరు దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీ తప్పు చేయలేదని సత్యవర్ధన్ చెప్పినప్పటికీ తప్పుడు కేసు పెట్టారని అన్నారు. వంశీని 71వ నిందితుడిగా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఘటన జరిగినప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోయానని …సత్యవర్ధన్ ను తీసుకెళ్లి తెల్లకాగితంపై సంతకం చేయించుకున్నారని జగన్ ఆరోపించారు.

గన్నవరం టీడీపీ కార్యాలయం తగలబడిందిలేదు.. ఆ కార్యాలయం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించింది కాదు.. కానీ, వంశీపై కక్షగట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పుడు కేసులు పెట్టించారని జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయం చేసే అధికారులు, నేతలను చట్టం ముందు నిలబెడతాం. న్యాయం జరిగేలా చేస్తాం అని జగన్ హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -