వైసీపీ అధినేత జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.రాజన్న రాజ్యం తీసుకొస్తానని ప్రకటించారు.అక్టోబర్ 27 న పాదయాత్రను ప్రారంభించనున్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టే 9 కార్యక్రమాలు ఇవే నంటూ జగన్ ప్రకటించారు.1. వైఎస్సార్ భరోసా: 5 ఎకరాలలోపు రైతులకు రూ.50 వేల సాయం.
రూ.3000 కోట్లతోరైతులకు గిట్టుబాటు ధర
2. వైఎస్సార్ ఆసరా: డ్వాక్రా మహిళల కోసం.. డ్వాక్రా మహిళలకు ప్రస్తుతం ఎంత రుణం ఉందో, దాన్ని నాలుగు విడతలుగా చెల్లించడం. సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడం
3. పింఛన్లు: ప్రస్తుతం యిస్తున్న రూ.1000కు బదులు రూ.2000 ఇవ్వడం
4. ‘అమ్మ ఒడి’ : ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలకు, ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1000. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కొక్కరికి రూ.750 చొప్పున ఇద్దరు పిల్లలకు నెలకు రూ.1500. ఇంటర్ విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున, ఇద్దరు పిల్లలకు రూ.2 వేలు నేరుగా తల్లులకే ఇస్తారు.
5. హౌసింగ్: ప్రతి పేదవాడికి ఉచితంగా ఇల్లు. జన్మభూమి వంటి కమిటీలతో పనిలేకుండా ఇళ్లు కేటాయింపు. దీని కింద 25 లక్షల ఇళ్లు కట్టించి పేదలకు ఇవ్వడం
6. ఆరోగ్యశ్రీ: ‘ఆరోగ్యశ్రీ’కి బడ్జెట్ లో అవసరమైన నిధుల కేటాయింపు. ఇంట్లో సంపాదించే వ్యక్తికి ఆపరేషన్ అయితే విశ్రాంతి సమయంలో ఆర్థికసాయం. కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్
7. ఫీజ్ రీయంబర్స్ మెంట్ : ప్రతి పేదవాడికి పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్.ఖర్చుల కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20 వేలు
8. జలయజ్ఞం: పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం
9. మద్య నిషేధం: మూడు దశలలో ఉంటుంది.
మొదటిదశలో.. ఊరూరా వెలిసిన బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడం.
రెండో దశలో.. పేద, మధ్య తరగతికి మద్యం అందుబాటులో లేకుండా నిషేధం విధించడం.
మూడో దశలో.. ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం లభించేలా చర్యలు తీసుకోవడం. మద్యం తయారు చేసినా, అమ్మినా, ఏడేళ్ల జైలు శిక్ష పడేలా చట్ట సవరణ తీసుకురావడం. మద్యం మానుకునేందుకు ముందుకు వచ్చే వారికి కౌన్సెలింగ్ ఇప్పిస్తామని, వైద్యం చేయిస్తామని చెప్పారు.
రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చారు.పాదయాత్రలో ప్రజలకు ప్రకటించిన పథకాలను అమలుచేశారు.ఇప్పుడు కూడా అదే దారిలో జగన్‌కూడా 9 పథకాలుకూడా అధికారం చేపట్టడానికి ఉపయేగపడతాయనడంలో సందేహంలేదు.
- Advertisement -
జగనన్న 9 పథకాలు ఏంటో తెలుసుకోండి….
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -