ప్రజాసంకల్ప యాత్ర చేపడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు. ప్యారడైజ్ పేపర్లలో ఉన్న తన పేరుపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలతోపాటు బాబుపై కూడా నిప్పులు చెరిగారు. తనకు విదేశాల్లో ఆస్తులు ఉన్నట్లుగా నిరూపించాలని సవాల్ చేశారు. ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా…నిరూపించలేకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా?’ అంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్ విసిరారు.
పాదయాత్రలో ఉన్న జగన్ ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను ప్యారడైజ్ పేపర్లలో ఉన్నానని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ‘చంద్రబాబునాయుడుకి 15 రోజుల సమయం ఇస్తున్నా… ప్యారడైజ్ పేపర్లలో నా పేరు ఉన్నట్టు నిరూపించగలరా? అలా ఆయన నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను.. ఒక వేళ నేను ఆపేపర్లలో లేనని నిర్ధారణ అయితే…ఆయన తన ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయగలరా?’ అని నిలదీశారు.
తాను ఏదైనా పెద్ద కార్యక్రమం లేదా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం మొదలు పెట్టగానే చంద్రబాబులో భయం మొదలవుతుందని, వెంటనే ఆరోపణలు, విమర్శలు చేస్తారని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా అలాగే ప్యారడైజ్ పేపర్ల వివాదం అంటూ విమర్శలు చేశారని ఆయన విమర్శించారు. జగన్ విసిరిసిన సవాల్‌ను బాబు స్వీకరిస్తారా లేక దున్నపోతు మీద వానకురుసినట్టు ఉంటారో చూడాలి.