వచ్చె నెల 6 నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందె. ఇప్పటికె పాదయాత్ర ఎలా నిర్వహించాలి,ఏఏ అంశాలను ప్రజలల్లోకి తీసుకెల్లాలనె విషయాలపై కసరత్తు పూర్తయ్యింది. అసెంబ్లీ సమావేశాలను సైతం బహిస్కరించి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
అయితె పాదయాత్రకు ముందె జగన్ లండన్, యూరప్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 28 లండన్,యూరప్ పర్యటన ముగించుకొని నవంబర్ 2న తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారని వైసీపీ వర్గాల సమాచారం. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత, నవంబర్ 6 నుంచి తలపెట్టిన పాదయాత్రలో జగన్ పాల్గొంటారు.
నవంబర్ 6 నుంచి జగన్ తలపెట్టనున్న మహా పాదయాత్రకు ‘ప్రజా సంకల్ప’ యాత్రగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్ర, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై అన్ని విభాగాల నేతలతో విస్తృతంగా చర్చించినట్టు జగన్ చర్చించారు.