Monday, May 5, 2025
- Advertisement -

న్యాయవాదుల కోసం రూ.100 కోట్లతో వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తాం..జ‌గ‌న్‌

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌లో భాగంగా ఇవాలా కృష్ణ జిల్లా కౌతవరంలో న్యాయవాదులతో ముఖాముఖి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. చివరకు న్యాయవాదులను సైతం మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. త‌మ స‌మ‌స్య‌ల‌పై ఓ విన‌తి ప‌త్రాన్ని న్యాయ‌వాదులు జ‌గ‌న్‌కు ఇచ్చారు.

ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి పథకాలు, సహాయ సహకారాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను విన్న ఆయన సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వకేట్లుగా ఎన్‌రోల్‌ అయినవారికి ఐదు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు.

అందరినీ మోసం చేసినట్టే, న్యాయవాదులను కూడా చంద్రబాబు మోసం చేశారని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే.. న్యాయవాదుల కోసం రూ.100 కోట్లతో వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రమాదవశాత్తు అడ్వకేట్లు మరణిస్తే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని, ఏపీలో హైకోర్టు ఎక్కడ వస్తుందో చూసి, చుట్టుపక్కల లాయర్లకు స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -